logo
Published : 24 May 2022 04:10 IST

తెరాసను తరిమికొట్టేందుకు సిద్ధమవ్వాలి: ఎంపీ ఉత్తమ్‌


హేమ్లాతండాలో వృథాగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పరిశీలిస్తున్న ఉత్తమ్‌, తదితరులు

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: జాతీయ స్థాయికి వెళ్లాలనుకునే తెరాసను ఈసారి తెలంగాణలోనే సమాధి చేయాలని.. నాలుగేళ్ల కిందట నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లనూ పేదలకివ్వలేని తెరాస ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు సిద్ధమవ్వాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మేళ్లచెరువు మండలంలో సోమవారం పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్లనూ పరిశీలించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కందిబండలో 515, హేమ్లాతండాలో 800 ఇళ్లు కట్టించిందన్నారు. తెరాస ప్రభుత్వం కనీసం 50 ఇళ్లనూ పేదలకు ఇవ్వలేదన్నారు. తెరాస ప్రభుత్వం చేతకానిదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను కనీసం ఎఫ్‌ఐఆర్‌ లోనూ చూపకుండా వికృత రాజకీయాలు చేస్తున్నారన్నారు. మండల నాయకులు కొట్టె సైదేశ్వరరావు, రామకృష్ణ, గోపిరెడ్డి, అన్నపురెడ్డి అప్పిరెడ్డి, జైపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని