logo

పేదల బతుకుల్లో వెలుగులు నింపాం: జానారెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, గ్రామాల అభివృద్ధి జరిగిందని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.

Updated : 01 May 2024 06:32 IST

నెమ్మికల్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

ఆత్మకూర్‌(ఎస్‌), పెన్‌పహాడ్‌, చివ్వెంల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, గ్రామాల అభివృద్ధి జరిగిందని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌లో, చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలకేంద్రాల్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.   నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి, తన కుమారుడు రఘువీర్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఏఐసీసీ నాయకుడు సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్‌, కాకి కృపాకర్‌రెడ్డి,  ధరావత్‌ వీరన్ననాయక్‌,  పార్టీ మండలాల అధ్యక్షుడు కందాల వెంకటరెడ్డి, తూముల సురేష్‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని