logo

ఈ క్రాప్‌లో అవకతవకలపై జేసీ ఆగ్రహం

జామాయిల్‌ సాగు పొలంలో శనగ పంట వేసినట్లు ఈ-క్రాప్‌ ఎలా నమోదు చేస్తారని నందవరం వీఏఏపై జేసీ కూర్మనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 07 Feb 2023 02:35 IST

వీఏఏకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఆదేశం

నందవరం వీఏఏని ప్రశ్నిస్తున్న జేసీ కూర్మనాథ్‌

మర్రిపాడు, న్యూస్‌టుడే: జామాయిల్‌ సాగు పొలంలో శనగ పంట వేసినట్లు ఈ-క్రాప్‌ ఎలా నమోదు చేస్తారని నందవరం వీఏఏపై జేసీ కూర్మనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నందవరం, పొంగూరు గ్రామాల్లో ఈ-క్రాప్‌ చేసిన పొగాకు, శనగ పంటను పరిశీలించారు. ఆ సందర్భంగా నందవరంలో జరిగిన ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబరు 396లో శనగ పంట వేసి ఉంటే.. జామాయిల్‌ సాగులో ఉన్న సర్వే నంబరు 168లో శనగ వేసినట్లు ఈ-క్రాప్‌ ఎలా చేస్తారన్నారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అయిన మీకు మీ పరిధిలో ఎంత పొలం ఉందో తెలియని స్థితిలో ఉన్నారా? రైతు చెప్పారని ఇష్టం వచ్చినట్లు  ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. సచివాలయంలో కూర్చొని పనిచేస్తే ఇలానే ఉంటుంది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే.. అక్కడ రైతు ఏ పంట వేశారో పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. వీఏఏ చెప్పింది.. వీఆర్వో తంబ్‌ చేశాను అనే సాకు చెప్పకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి పని చేయండి అని హితవు పలికారు.  రైతు ఏ పంట వేశారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? అనే వివరాలు తెలుసుకునేందుకు సూపర్‌ చెక్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఏఏకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని వ్యవసాయశాఖ జేడీని ఆదేశించారు. పొంగూరు కండ్రికలో భూ ఆక్రమణలను సీపీఐ నాయకులు జేసీ దృష్టి తీసుకెళ్లిగా, భూ సమస్య తమ దృష్టికి వచ్చిందని, సమగ్ర విచారణ జరిపి త్వరలోనే అర్హులకు న్యాయం చేస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని