logo

తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో చిన్నబజారు పరిధిలో రూ.9,90,071, బాలాజీనగర్‌ పరిధిలో రూ.5,00,000, రాపూరు పరిధిలో రూ.1,29,000 నగదు పట్టుకున్నారు.

Published : 16 Apr 2024 02:53 IST

నెల్లూరు(నేర విభాగం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో చిన్నబజారు పరిధిలో రూ.9,90,071, బాలాజీనగర్‌ పరిధిలో రూ.5,00,000, రాపూరు పరిధిలో రూ.1,29,000 నగదు పట్టుకున్నారు. జూద స్థావరంపై దాడులుచేసి సంతపేట పరిధిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుడ్లూరు పరిధిలో 68 మద్యం బాటిళ్లు, వెంకటాచలంలో 12, సైదాపురంలో 14, కలిగిరిలో 6, సీతారామపురం 10, కందుకూరు గ్రామీణంలో 13, సెబ్‌ అధికారులు 215 మొత్తం 338 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు