logo

బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించిన వైకాపా ప్రభుత్వం

‘రాష్ట్రంలో బలహీన వర్గాలను వైకాపా ప్రభుత్వం అణచి వేస్తోంది.. వారికి సంబంధించిన 30 పథకాలను రద్దు చేసింది. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.80వేల కోట్లు దారి మళ్లించింది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు.

Published : 17 Apr 2024 03:38 IST

మాట్లాడుతున్న బీద రవిచంద్ర

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో బలహీన వర్గాలను వైకాపా ప్రభుత్వం అణచి వేస్తోంది.. వారికి సంబంధించిన 30 పథకాలను రద్దు చేసింది. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.80వేల కోట్లు దారి మళ్లించింది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన జిల్లా తెదేపా బీసీ సెల్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత ఎన్టీఆర్‌, నారా చంద్రబాబునాయుడులదేనన్నారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన స్థానిక సంస్థల పదవుల్లో కోత విధించారని ఆరోపించారు. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాటాడారు. సమావేశంలో డాక్టర్‌ జెడ్‌ శివప్రసాద్‌, పీఎల్‌ రావు, పొలిశెట్టి, బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని