logo

పరిధి పెద్ద.. సమస్యల తిష్ఠ

నెల్లూరు నగరంలోని 37వ డివిజన్‌ పరిధి పెద్దదిగా ఉన్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదు. డివిజన్‌లో కొండాయపాళెం రోడ్డు, మిలటరీకాలనీ, టీసీఎస్‌నగర్‌, వేమాలశెట్టిబావి సంఘం, రామ్‌నగర్‌, సరస్వతినగర్‌, క్రాంతినగర్‌, రాజగోపాలపురం, వేణుగోపాలస్వామి భూములున్న ప్రాంతం, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట రోడ్డు, ఇండియన్‌ గ్యాస్‌రోడ్డు తదితర ప్రాంతాలున్నాయి.

Updated : 17 Apr 2024 04:55 IST

37వ డివిజన్‌లో ఇదీ పరిస్థితి
న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

 నెల్లూరు నగరంలోని 37వ డివిజన్‌ పరిధి పెద్దదిగా ఉన్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదు. డివిజన్‌లో కొండాయపాళెం రోడ్డు, మిలటరీకాలనీ, టీసీఎస్‌నగర్‌, వేమాలశెట్టిబావి సంఘం, రామ్‌నగర్‌, సరస్వతినగర్‌, క్రాంతినగర్‌, రాజగోపాలపురం, వేణుగోపాలస్వామి భూములున్న ప్రాంతం, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట రోడ్డు, ఇండియన్‌ గ్యాస్‌రోడ్డు తదితర ప్రాంతాలున్నాయి. ఉన్న ప్రధాన ప్రాంతాలన్నీ మెయిన్‌ రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. కొండాయపాళెం రోడ్డులో దోమల బెడద తీవ్రంగా ఉంది. పలుచోట్ల సిమెంట్‌ రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారిపోతున్నాయి. మిలటరీ కాలనీలో ఇటీవల కాలంలో వచ్చిన భారీ తుపాన్‌ వల్ల చెట్లన్నీ దెబ్బతిన్నాయి. గతంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించింది. వేమాలశెట్టి బావి వద్ద ప్రముఖ దేవాలయం ఉంది. పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారికి అనుగుణంగా పూర్తిగా సదుపాయాలు లేవని చెబుతున్నారు.

కొండాయపాళెం వెళ్లే మార్గంలో దెబ్బతిన్న రహదారి

సరిగా లేని మురుగు కాలువలు

రామ్‌నగర్‌, క్రాంతినగర్‌ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లున్నా.. మురుగు కాలువలు సరిగాలేవు. కొన్ని వీధుల్లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన చిన్నపాటి కాలువలు ఉండటం వల్ల మురుగుతో నిండిపోతున్నాయి. దీంతో దోమల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. సరస్వతీనగర్‌, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట ప్రాంతాల్లో విపరీతంగా దోమలు ఉండటం వల్ల ఇటీవల పలువురు విషజ్వరాలకు గురయ్యారని అక్కడి వారంతా వాపోతున్నారు. టెక్కేమిట్ట మెయిన్‌రోడ్డు వద్ద సాగునీటి కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వాహనచోదకులు భయంభయంగా కాలం గడుపుతున్నారు. అపార్ట్‌మెంట్ల వద్ద సగభాగŸమే మెయిన్‌రోడ్డు వేసి మిగిలినది వదిలేశారు. ఇండియన్‌ గ్యాస్‌ రోడ్డు ప్రాంతంలో రాత్రి వేళల్లో చీకటిగా ఉంటోందని వీధి దీపాల సంఖ్య పెంచాలని అక్కడి వారు తెలిపారు. పలుచోట్ల రోడ్డు పక్కల మట్టిదిబ్బలు పోశారు.

దోమల బెడద: లక్ష్మి, టెక్కేమిట్ట

టెక్కేమిట్ట నుంచి పరిసర ప్రాంతాల్లో దోమలు తీవ్రంగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఇంటి తలుపులు మూసుకోవాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్న రైల్వేలైను పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.

ప్రహరీలు నిర్మించండి: శోభన్‌బాబు

సాగునీటి కాలువల వద్ద ప్రహరీలు లేవు. వీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. విషయాన్ని అధికారులు గుర్తించలేదు. వాహనాలు అదుపు తప్పితే  ప్ర£మాదం జరిగే అవకాశం ఉంది. కాలువల చుట్టూ ప్రహారీలు నిర్మించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు