logo

ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాడతాం

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించే వరకు తెరాస ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పార్టీ నియోజకవర్గ నాయకులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

Published : 15 Jan 2022 03:16 IST

సమావేశంలో మాట్లాడుతున్న తెరాస సీనియర్‌ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, పక్కన ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు తదితరులు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించే వరకు తెరాస ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పార్టీ నియోజకవర్గ నాయకులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలతో దివాలా తీయిస్తోందని విమర్శించారు. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించి రైతులపై బిల్లుల భారం మోపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఒక్క యూరియాను మాత్రమే తమ గుప్పిట్లో పెట్టుకొని మిగిలిన వాటిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి అడ్డగోలుగా ధరలు పెంచుతోందన్నారు. సమావేశంలో తెరాస సీనియర్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, బల్వంత్‌రావు, పిప్పిరి వెంకటి, కృష్ణాజీరావు, లక్ష్మీనారాయణ, ముప్పారపు ఆనంద్‌, అమ్జద్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని