logo

అమరుల త్యాగాలతోనే స్వాతంత్య్రం

అమరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి

Published : 12 Aug 2022 03:23 IST

ఫ్రీడం రన్‌లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే తదితరులు

కామారెడ్డి క్రీడావిభాగం, కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: అమరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. త్యాగాలను స్మరించుకుంటూ నేడు వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పౌరులు జాతీయభావం పెంపొందించుకొని సామరస్యంగా మెలగాలని పేర్కొన్నారు. కొత్త బస్టాండు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించిన 2.5 కి.మీ. పరుగులో అన్ని వర్గాలు భాగస్వామ్యమయ్యాయి. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, ఏఎస్పీ అన్యోన్య, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌, సీపీవో రాజారాం, డీఆర్డీవో సాయన్న, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఎస్పీ సోమనాథం, క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, డీఏవో భాగ్యలక్ష్మి, ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

లింగంపేట: మహానీయుల త్యాగ ఫలితమే నేటి భారతదేశమని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని రైతు వేదిక భవనం నుంచి బాలుర ఉన్నత పాఠశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సురేందర్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. జడ్పీటీసీ శ్రీలత, సర్పంచి లావణ్య, ఆర్డీవో శ్రీనునాయక్‌, సొసైటీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్‌  మారుతి, ఎంపీడీవో పర్వన్న, ఎంఈవో రామస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని