logo

ఆదాయాన్ని రెట్టింపు చేద్దాం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎరువుల విక్రయాలతో ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఐడీసీఎంఎస్‌ (ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) తీర్మానించింది. నిజామాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్‌

Published : 29 Sep 2022 03:21 IST

మాట్లాడుతున్న డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ సంబారి మోహన్‌

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎరువుల విక్రయాలతో ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఐడీసీఎంఎస్‌ (ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) తీర్మానించింది. నిజామాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్‌ సంబారి మోహన్‌ అధ్యక్షతన బుధవారం మహాజన సభ నిర్వహించారు. సొసైటీ ఆర్థిక లావాదేవీలను చదివి వినిపించారు. పీఏసీసీఎస్‌లకు ఎరువుల సరఫరా కోసం అవసరమైన లైసెన్సు మంజూరులో నిబంధనలు సడలించాలని అధికారులను కోరారు. ఎరువులను హోల్‌సేల్‌గా విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి రాయుడు తిరుమల ప్రసాద్‌, ఉద్యాన శాఖాధికారి నర్సింగ్‌దాస్‌, డీసీవో సింహాచలం, మేనేజర్‌ కె.నగేశ్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని