logo

ఇందూరులో మొదలై నిషేధం వరకు..

పీఎఫ్‌ఐ(పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) పేరిట దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన ఘటనలో కేంద్రం కఠిన చర్యలు తీసుకొంది. ఆ సంస్థపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం

Published : 29 Sep 2022 03:21 IST

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: పీఎఫ్‌ఐ(పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) పేరిట దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన ఘటనలో కేంద్రం కఠిన చర్యలు తీసుకొంది. ఆ సంస్థపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ ముసుగులో యువతను ఆకర్షించి దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని తొలుత నిజామాబాద్‌ పోలీసులు గుర్తించారు. జులైలో ఆరో ఠాణాలో మొదటి కేసు నమోదు చేశారు. సీపీ నాగరాజు ప్రత్యేక చొరవ తీసుకొని కేసు తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ స్వీకరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు