logo

ఇసుక మేటలు.. అక్రమార్కులకు కాసులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అలీసాగర్‌ జలాశయం గేట్లు ఎత్తడంతో ఠాణాకలాన్‌ నుంచి జైతాపూర్‌ వరకు వాగులో ఇసుక మేటలు వేశాయి. ఠాణాకలాన్‌ శివారులో అధిక మొత్తంలో ఉండడంతో అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ట్రాలీకి రూ.4 వేలకు పైగానే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 03 Oct 2022 03:41 IST

ఠాణా కలాన్‌ శివారులో ఇసుక కుప్ప

ఎడపల్లి, న్యూస్‌టుడే:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అలీసాగర్‌ జలాశయం గేట్లు ఎత్తడంతో ఠాణాకలాన్‌ నుంచి జైతాపూర్‌ వరకు వాగులో ఇసుక మేటలు వేశాయి. ఠాణాకలాన్‌ శివారులో అధిక మొత్తంలో ఉండడంతో అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ట్రాలీకి రూ.4 వేలకు పైగానే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని