logo

మహాత్మాగాంధీ మార్గ్‌గా నామకరణం

మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామస్వరాజ్యం సాధించాలని ఆ గ్రామస్థులు సంకల్పించారు. చందూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి సాయిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం గ్రామసభను నిర్వహించారు.

Published : 03 Oct 2022 03:41 IST

చందూర్‌(వర్ని), న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామస్వరాజ్యం సాధించాలని ఆ గ్రామస్థులు సంకల్పించారు. చందూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి సాయిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యల పై చర్చించారు.  చందూర్‌ ప్రయాణ ప్రాంగణం నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డుకు మహాత్మాగాంధీ మార్గ్‌గా నామకరణం చేయాలని తీర్మానించారు. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంగా ఉంచుతామని మాటిచ్చినట్లు సర్పంచి తెలిపారు. బాపు స్ఫూర్తితో ఇదే విధానాన్ని ప్రతీ వార్డులో అమలు చేయడానికి ప్రజలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని