logo

లారీ వచ్చింది.. ధాన్యం వెళ్లింది

మండల కేంద్రంలో మే 13వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.

Published : 02 Jun 2023 05:56 IST

మొక్కజొన్న బస్తాలను లారీలో నింపుతున్న హమాలీలు

గాంధారి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో మే 13వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. హమాలీలు, లారీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వరుసగా ఈనాడులో మే 29న ‘హమాలీల కొరత.. తూకంలో  ఆలస్యం..’, జూన్‌ 1న ‘రాని లారీ.. కదలని హలధారి’ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు హమాలీలు, లారీల కొరత తీర్చి గురువారం ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో కొంతమేర సమస్య తీరింది. మిగిలిన ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని