logo

పాత్రికేయులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే పాత్రికేయులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. పిలుపునిచ్చారు.

Published : 28 Jan 2023 02:04 IST

మాట్లాడుతున్న ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. చిత్రంలో ప్రెస్‌ క్లబ్‌, మీడియా ప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే పాత్రికేయులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. పిలుపునిచ్చారు. నగరానికి చెందిన జర్నలిస్టు చిరంజిత్‌ రాజగురు (చింటు) ఇటీవల తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పిస్తూ బ్రహ్మపుర ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించింది. స్థానిక ఎస్‌బీఐ రోడ్డులోని ప్రెస్‌ క్లబ్‌ ఆవరణలో నిర్వహించిన సభకు హాజరైన ఎస్పీ శరవణ వివేక్‌ మాట్లాడుతూ చింటు అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పాలుంచి నివాళులర్పించారు. సీనియరు జర్నలిస్టు సుదీప్‌ సాహు సమన్వయకర్తగా వ్యవహరించిన సభలో ప్రెస్‌ క్లబ్‌, సీనియరు మీడియా ప్రతినిధులు జగన్మోహన్‌ మహాపాత్ర్‌, అశోక్‌ బ్రహ్మ, మనోజ్‌కాంత్‌ దాస్‌, హేమాంగ రవుళొ, నారాయణ మహంకుడొ, బిశ్వనాథ్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు