logo

బంగారం ఆభరణాలు స్వాధీనం: ఉద్యోగి అరెస్టు

స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ బంగారం దుకాణంలో సహాయ మేనేజరుగా పనిచేస్తున్న సిమాంచల పాత్ర్‌ అలియాస్‌ లిపు (30) అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానానికి తరలించారు.

Published : 07 Feb 2023 01:44 IST

స్వాధీనం చేసుకున్నఆభరణాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ బంగారం దుకాణంలో సహాయ మేనేజరుగా పనిచేస్తున్న సిమాంచల పాత్ర్‌ అలియాస్‌ లిపు (30) అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానానికి తరలించారు. ఆయన నుంచి రూ.33.38 లక్షల విలువ గల 523.23 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడు పాత్ర్‌ వినియోగదారుల ఇళ్లకు వెళ్లి బంగారు ఆభరణాలు చూపిస్తానని నమ్మించి దుకాణం నుంచి ఆభరణాలు తీసుకెళ్లాడు. వారం రోజులైనా వాటిని తిరిగి దుకాణానికి ఇవ్వకపోవడంతో సంస్థ మేనేజరు పెద్దబజారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఆభరణాలను రెండు ప్రైవేటు సంస్థల్లో తనఖా పెట్టి రూ.19.70 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఆ సొమ్ముతో నిందితుడు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడినట్లు వెల్లడైంది. తనఖా పెట్టిన ఆభరణాలను ఆయన విడిపించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆ ప్రకటనలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని