logo

రాయగడ కోట చేజిక్కించుకునేదెవరో?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి రాయగడ కోటను ఎవరు చేజిక్కుంచుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 1951 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, జనతాదళ్‌, బిజద అభ్యర్థులే గెలుపొందారు.

Updated : 17 Apr 2024 06:31 IST

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి రాయగడ కోటను ఎవరు చేజిక్కుంచుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 1951 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, జనతాదళ్‌, బిజద అభ్యర్థులే గెలుపొందారు. 2019లో ఊహించని రీతిలో స్వతంత్ర అభ్యర్థి మకరంద ముదిలి విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో రాయగడలో తమ జెండా ఎగరవేసేందుకు బిజద పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తొలిసారిగా ఇక్కడ మహిళా అభ్యర్థి అనుసూయ మాఝిని బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి అప్పల స్వామి కడ్రక, భాజపా తరఫున బసంత ఉలక బరిలో ఉన్నారు. దీంతో గట్టి పోటీ జరగనుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని