logo

వేరే దారి లేక.. డోలీ మోత

సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి.

Published : 29 Mar 2024 04:34 IST

గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చిన గిరిజనులు

రంగంవలస నుంచి మోసుకొస్తున్న దృశ్యం

సీతంపేట, న్యూస్‌టుడే: సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. పురిటి నొప్పులు పడే గర్భిణుల పరిస్థితి అయితే ఇక వర్ణించలేం.. ఈ పరిస్థితి మరెక్కడో కాదండీ మన పక్కనే ఉన్న రంగంవలస గ్రామంలో చోటు చేసుకున్నాయి.

సీతంపేట మండలం రంగంవలస గిరిజన గ్రామానికి సరైన రోడ్లు లేక గ్రామానికి 108 అంబులెన్సు కానీ, ఇతర వాహనాలు కానీ వచ్చే పరిస్థితి లేదు. గురువారం గ్రామానికి చెందిన సవర చిన్నమ్మి అనే గిరిజన గర్భిణి పురిటినొప్పులతో బాధపడడంతో ఆమెను డోలీలో మోసుకొని మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తీసుకువచ్చారు. ఆసుపత్రిలో రెండో కాన్పులో భాగంగా ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయమై మర్రిపాడు వైద్యాధికారి సాయిచరణ్‌ మాట్లాడుతూ తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో రాళ్లు, పొదలు దాటుకొని అత్యవసర వేళ  డోలీలో మోసుకురావాల్సిన దుస్థితి ఎదురవుతుందని స్థానిక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. తాము ఎన్ని కష్టాలు పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదన్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి వాహనాలు వచ్చేలా పూర్తి స్థాయి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని