logo

ఐఏఎస్‌ సాధనే లక్ష్యం

ఐఏఎస్‌ సాధించడమే తన జీవిత లక్ష్యమని సివిల్స్‌ విజేత పి.భార్గవ్‌ పేర్కొన్నారు. మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 590 ర్యాంకు సాధించారు.

Updated : 17 Apr 2024 05:59 IST

సివిల్స్‌ విజేత భార్గవ్‌

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఐఏఎస్‌ సాధించడమే తన జీవిత లక్ష్యమని సివిల్స్‌ విజేత పి.భార్గవ్‌ పేర్కొన్నారు. మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 590 ర్యాంకు సాధించారు. గతేడాది వచ్చిన ఫలితాల్లో 772 ర్యాంకు సాధించడం ద్వారా ఐడీఏఎస్‌(ఇండియన్‌ డిఫెన్స్‌ అకాడమీ సర్వీస్‌)లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ‘ఈ ప్రయత్నంలో ర్యాంకు మెరుగుపర్చుకున్నా. ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున ఐఏఎస్‌ కోసం మళ్లీ ప్రయత్నిస్తానని’ ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. భార్గవ్‌ది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. తల్లిదండ్రులు సత్యం, పద్మావతి. 2016లో బీటెక్‌ పూర్తిచేసి తొలుత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగంలో చేరారు. ఆ కొలువును వదులుకుని 2018 నుంచి ఐఏఎస్‌ కోసం సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని