logo

పాలీసెట్‌లో మెరిసిన బాలికలు

పాలీసెట్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు.

Published : 09 May 2024 03:17 IST

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాలీసెట్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు. బీ విజయనగరం జిల్లాకు చెందిన వడ్డి త్రినయని 115 మార్కులతో రాష్ట్రస్థాయిలో 155వ ర్యాంకు సాధించింది. నగరానికి చెందిన తిరుమల రెడ్డి వెంకట శ్యామల్‌ శ్రీనిధ్‌ అపూర్‌ 112 మార్కులతో 285వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తొత్తడి శైలేష్‌  285వ ర్యాంకు పొందాడు. పూసపాటిరేగ మండలం తులసిదిబ్బ ప్రాంతానికి చెందిన కె.హారిక- 333, బొబ్బిలికి చెందిన జక్కు త్రివేణి- 703, పూసపాటిరేగ మండలం కుమిలికి చెందిన దేవరాపు వేదశ్రీ- 1676, విజయనగరం దాసన్నపేటకు చెందిన పట్నాయకుని ప్రణీత 1880 ర్యాంకులతో మెరిశారు. బీ మన్యం జిల్లాలో పి.మౌనికకు 383వ ర్యాంకు వచ్చింది. 110 మార్కులు వచ్చాయి. వి.ధనలక్ష్మి- 1,899, ఎన్‌.నితిన్‌ కుమార్‌- 2,056 ర్యాంకులతో తర్వాత స్థానాల్లో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని