logo

అభాగ్యులకు రూ.1.25 లక్షల ఆర్థిక సాయం

అనారోగ్యం, మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు కూతుళ్లతో వృద్ధురాలైన తల్లి షేక్‌ రహమత్‌ బీ పడుతున్న అవస్థలను తెలియజేస్తూ ‘ఈనాడు’లో ఈ నెల 5న ప్రచురితమైన ‘కన్నీళ్లే మా నేస్తాలు’ కథనానికి నాయకులు, అధికారులు స్పందించారు. కనిగిరి పట్టణంలోని బొగ్గులగొంది కాలనీకి చెందిన రహమత్‌ బీ కేవలం తనకు వస్తున్న పింఛను సొమ్ముతో మంచానికే

Published : 27 Jan 2022 06:24 IST

 


రహమత్‌బీ కుటుంబానికి నగదు అందిస్తున్న ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ చిత్రంలో నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: అనారోగ్యం, మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు కూతుళ్లతో వృద్ధురాలైన తల్లి షేక్‌ రహమత్‌ బీ పడుతున్న అవస్థలను తెలియజేస్తూ ‘ఈనాడు’లో ఈ నెల 5న ప్రచురితమైన ‘కన్నీళ్లే మా నేస్తాలు’ కథనానికి నాయకులు, అధికారులు స్పందించారు. కనిగిరి పట్టణంలోని బొగ్గులగొంది కాలనీకి చెందిన రహమత్‌ బీ కేవలం తనకు వస్తున్న పింఛను సొమ్ముతో మంచానికే పరిమితమైన ఇద్దరు కూతుళ్ల కడుపు నింపడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు వారిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మందులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలను ‘ఈనాడు’ పత్రిక ద్వారా తెలుసుకున్న పోలీసులు, అధికారులు, దాతలు ప్రెస్‌క్లబ్‌ ద్వారా రూ.1.25 లక్షలు సేకరించారు. ఆ మొత్తాన్ని బుధవారం ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి అభాగ్యుల కష్టాలను ప్రచురించి దాతలు ఆదుకునేలా చేసిన ‘ఈనాడు’కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రహమత్‌బీ కుటుంబానికి తాను కూడా కొంత సాయం అందిస్తానని, తక్షిణమే జగనన్న కాలనీలో ఇల్లు, పింఛను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురికీ పూర్తి స్థాయి వైద్యం అందేలా కృషి చేస్తానన్నారు. నగర పంచాయతీ వైస్‌ ఛైర్మన్‌ పులి శాంతి, గోవర్థన్‌రెడ్డి దంపతులు, బియ్యం, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు సయ్యద్‌ షఫీ, నారాయణరెడ్డి, కృష్ణ, నరసింహారావు, స్నేహ హస్తం ప్రతినిధి సుధీర్‌బాబు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని