logo

పోలీసు అధికారులకు ఎస్పీ ప్రశంస

పోక్సో కేసులో నిందితుడైన వ్యక్తి కోర్టు ద్వారా శిక్ష విధించటంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

Published : 30 Jun 2022 02:13 IST

ప్రశంసాపత్రాలు అందుకున్న పోలీసు అధికారులతో ఎస్పీ మలికా గార్గ్‌, అదనపు ఎస్పీ(అడ్మిన్‌) నాగేశ్వరరావు

ఒంగోలు నేరవిభాగం: పోక్సో కేసులో నిందితుడైన వ్యక్తి కోర్టు ద్వారా శిక్ష విధించటంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మార్కాపురం పట్టణానికి చెందిన ఎ.చెన్నయ్య అనే వ్యక్తికి న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష, రూ.4,000 జరిమానా విధించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన మార్కాపురం సీఐ ఎం.భీమానాయక్‌, పోక్సో మానిటరింగ్‌ టీమ్‌ సభ్యురాలు, దిశ స్టేషన్‌ ఎస్సై రజియా సుల్తానా బేగం, కోర్టు లైజన్‌ ఏఎస్సై వెంకటస్వామి, మార్కాపురం కోర్టు హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.గురవారెడ్డి, పోక్సో కోర్టు కానిస్టేబుల్‌ యలమందలను ఎస్పీ మలికా గార్గ్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా ప్రత్యేకంగా పోక్సో పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసి కోర్టుల్లో దోషులకు శిక్షపడేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని