logo

స్వాతంత్య్ర దినోత్సవానికి భారీ ఏర్పాట్లు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. పోలీసు కవాతు మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మలికా గార్గ్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2.75 లక్షల జాతీయ పతకాలను ప్రజలకు

Published : 13 Aug 2022 05:22 IST

విద్యార్థినికి ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా

గార్గ్‌, చిత్రంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. పోలీసు కవాతు మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మలికా గార్గ్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2.75 లక్షల జాతీయ పతకాలను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ముందుగా మైదానంలో ఆధునికీకరించిన ప్రధాన వేదిక, రూఫ్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం వీఐపీ గ్యాలరీ, స్టాళ్లు, శకటాల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. ఏఎస్పీలు కె.నాగేశ్వరరావు, శ్రీధర్‌, డీఎస్బీ డీఎస్పీ మరియదాసు, ఏఆర్‌ డీఎస్పీ రాఘవేంద్రరావు, పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని