logo

మురిసిన జెండా... దేశభక్తే మది నిండా...

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు,...

Published : 14 Aug 2022 02:41 IST


దర్శిలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జెండా పద్రర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల అలంకరణతో మురిపించారు. భారత్‌ మాతాకీ జై అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. వివిధ శాఖల అధికారులు కార్యాలయాల్లో జెండా ఎగరేశారు. ప్రజా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు ప్రదర్శన చేపట్టాయి.


మువ్వన్నెల జెండాలు, మహనీయుల చిత్రపటాలతో వై.పాలెం పట్టణంలో ర్యాలీ


టంగుటూరులో ర్యాలీ


మార్కాపురంలో ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసం


మంగమూరులో నినాదాలతో..

-న్యూస్‌టుడే యంత్రాంగం


స్ఫూర్తి నింపుదాం


ఒంగోలులో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో ఊరేగింపుగా వాహనంపై వెళ్తున్న ఓ ప్రైవేట్‌ పాఠశాల చిన్నారులు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా అంతటా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ప్రదర్శనలు, వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోనూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఫ్లెక్సీ వద్ద స్వీయ చిత్రం తీసుకున్నారు. ప్రజలంతా ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు.


జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌


దినేష్‌కుమార్‌

-ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని