logo

గుప్త నిధుల కోసం నంది విగ్రహం ధ్వంసం

సి.ఎస్‌.పురం మండలం నలజనంపాడు శివారులో శిథిలమైన అంకాలమ్మ, పోలేరమ్మ దేవస్థానంలో గుప్త నిధుల కోసం అయిదుగురు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Published : 25 Nov 2022 05:48 IST

నిందితులను పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ అభినందనలు

ప్రశంసాపత్రాలు అందుకున్న సిబ్బందితో ఎస్పీ మలికా గార్గ్‌, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు,

శ్రీధర్‌రావు, కనిగిరి ఇన్‌ఛార్జి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి

సి.ఎస్‌.పురం, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సి.ఎస్‌.పురం మండలం నలజనంపాడు శివారులో శిథిలమైన అంకాలమ్మ, పోలేరమ్మ దేవస్థానంలో గుప్త నిధుల కోసం అయిదుగురు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున పామూరు పట్టణంలోని సి.ఎస్‌.పురం రోడ్డులో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా అటువైపు వస్తున్న కారులో గడ్డపారలు, పెద్ద సమ్మెట తదితర సామగ్రిని పోలీసులు గుర్తించారు. వాహనంలో ఉన్న అయిదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల కోసం వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రదేశాన్ని తహసీల్దార్‌ ఎ.బాలకిషోర్‌, పామూరు ఎస్సై కె.సురేష్‌, వీఆర్వో శ్రీనివాసులు పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలమై ఎటువంటి పూజలు జరగడం లేదన్నారు. నిందుతులను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ షేక్‌ రహంతుల్లా, హోంగార్డులు డి.రమణయ్య, ఎ.వెంకటేశ్వర్లులను ఎస్పీ మలికా గార్గ్‌ ఒంగోలులోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్‌రావు, కనిగిరి ఇన్‌ఛార్జి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, పామూరు సీఐ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని