logo

పొగాకు వ్యాపారుల పోటాపోటీ

అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారులకు పొగాకు ఎగుమతి అనుమతులు ఖరారయ్యాయి. దీంతో గత వారం రోజులుగా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో వ్యాపారులు పోటీ పడుతున్నారు.

Published : 10 Jun 2023 05:57 IST

పెరుగుతున్న ధరలు

ఒంగోలు-2 కేంద్రంలో పొగాకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారులకు పొగాకు ఎగుమతి అనుమతులు ఖరారయ్యాయి. దీంతో గత వారం రోజులుగా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో వ్యాపారులు పోటీ పడుతున్నారు. తద్వారా మేలిమి నుంచి లో గ్రేడ్‌ రకం పొగాకు ధర వరకూ రెక్కలొచ్చాయి. జిల్లాలోని కేంద్రాల్లో శుక్రవారం జరిగిన వేలంలో ఒంగోలు-2 కేంద్రంలో అత్యధికంగా రూ.229 చొప్పున లభించింది. ఒంగోలు-1, కొండపి, పొదిలిలో రూ.228; టంగుటూరు-1లో రూ.227; వెల్లంపల్లిలో రూ.226, కనిగిరిలో రూ.224 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఈ ఏడాది నెలకొన్న గిరాకీ కారణంగా ఎఫ్‌-4, ఎఫ్‌-5 రకాలకు కూడా మేలిమితో సమానంగా ధర పలుకుతోంది. ఎస్‌బీఎస్‌ రీజియన్‌ పరిధిలో 4,077 బేళ్లురాగా, అందులో 3,833 బేళ్లు; ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌ పరిధిలో 2,520 బేళ్లు రాగా, అందులో 2,270 బేళ్లను కొనుగోలు చేశారు. కొండపి కేంద్రంలో కనిష్ఠ ధర రూ.150 చొప్పున లభించింది. ప్రముఖ సంస్థ కొనుగోళ్లను వేగం చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. వ్యాపారుల పోటీ కారణంగా ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటక మార్కెట్‌తో సమానంగా ధర లభిస్తున్న నేపథ్యంలో రానున్న సీజన్‌లో సాగు మరింత పెరగనుంది. పొదిలి కేంద్రంలో శుక్రవారం జరిగిన కొనుగోళ్లను బోర్డు ఆర్‌.ఎం.లక్ష్మణరావు పరిశీలించారు.

 పొదిలి, న్యూస్‌టుడే : పొదిలి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం పొగాకు కిలో గరిష్ఠధర రూ.228 పలికింది. ఒంగోలు వేలం కేంద్రంలో గరిష్ఠధర కిలో రూ.229 పలకగా పొదిలిలో రూ.228 ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి గ్రేడ్లతో సంబంధం లేకుండా వ్యాపారులు ధర చెల్లిస్తుండటం రైతులకు కలిసొస్తోంది. ఈ సీజన్‌లో గరిష్ఠధర రూ.245 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 842 బేళ్లను వేలానికి తీసుకురాగా 789 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ఠధర కిలో రూ.228, కనిష్ఠ ధర రూ.156, సరాసరి ధర రూ.220 పలికింది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని