logo

జీజీహెచ్‌లో రోగుల భోజనంపై విచారణ

సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్‌ విభాగం అధికారులు స్పందించారు.

Published : 28 Mar 2024 02:03 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్‌ విభాగం అధికారులు స్పందించారు. ‘అడగలేనోళ్లతో చెలగాటం’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో వచ్చిన కథనం గురించి తెలుసుకున్న డీఎంఈ విచారణ కోసం ప్రత్యేకాధికారిని పంపించారు. ఆయన మధ్యాహ్నం రోగులకు అందించిన ఆహారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూలో అరటిపండు ఇవ్వాల్సి ఉండగా, రోగులకు అందనట్లు గుర్తించారు. రోగుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌, ఆర్‌ఎంవో హనుమంతరావు, డైటీషియన్‌ ప్రసాదరావులతో సమావేశమయ్యారు. సూపరింటెండెంట్‌, సీఎస్‌ఆర్‌ఎంవోలు ప్రత్యేకాధికారికి వివరాలు తెలిపారు. మార్చి ఒకటి నుంచి తెనాలికి చెందిన గుత్తేదారు భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. భోజనంలో నాణ్యత లేదని, సమయాలు పాటించడం లేదని గతంలో రెండు సార్లు నోటీసులిచ్చినట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం సిబ్బంది, రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గుత్తేదారును పిలిచి డైట్‌ విషయంలో నిబంధనలు పాటించకపోతే కాంట్రాక్టు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రత్యేకాధికారి డీఎంఈకు అందించే నివేదికను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని