logo

రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

Published : 28 Mar 2024 02:30 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు సంబంధించిన ఫారం-7, ఫారం-8లను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. దీనిపై సీఈవో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన నివేదికలను ప్రతి రోజూ సకాలంలో తనకు పంపించాలని సూచించారు. సమావేశంలో జేసీ రోణంకి గోపాలకృష్ణ, సహాయ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, డీఆర్వో శ్రీలత, ఎన్నికల విభాగం పరిశీలకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని