logo

ఏడాదిలో రూ.1360.84 కోట్ల మద్యం విక్రయాలు

వెనుకబడిన జిల్లాగా పేరుబడిన సిక్కోలు ఏటా మద్యంపై జిల్లావాసులు చేసే ఖర్చు ఏటికేడు పెరిగిపోతోంది. గత రెండేళ్లు కరోనా విజృంభించింది. సామాన్య, మద్యతరగతి ప్రజలు ఎన్నడూ లేనంతగా ఆర్థిక కష్టాలను చవిచూశారు. అలాంటి సందర్భాల్లోనూ మద్యం అమ్మకాలు ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

Published : 17 Jan 2022 04:04 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: వెనుకబడిన జిల్లాగా పేరుబడిన సిక్కోలు ఏటా మద్యంపై జిల్లావాసులు చేసే ఖర్చు ఏటికేడు పెరిగిపోతోంది. గత రెండేళ్లు కరోనా విజృంభించింది. సామాన్య, మద్యతరగతి ప్రజలు ఎన్నడూ లేనంతగా ఆర్థిక కష్టాలను చవిచూశారు. అలాంటి సందర్భాల్లోనూ మద్యం అమ్మకాలు ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు జిల్లాలో రూ.1,360.84 కోట్లు మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 2020లో రూ.980.41 కోట్లు, 2019లో రూ.1,028.05 కోట్లు విక్రయాలు చేశారు. రెండేళ్ల వ్యవధిలో సుమారు రూ.330 కోట్ల మేర అదనపు విక్రయాలు సాగాయి. ఆదాయం మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. గతేడాది జరిగిన రూ.1360 కోట్లు అమ్మకాల కారణంగా పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.1088 కోట్లు మేర నిధులు జమ అయినట్లు ఆయా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని