logo

మొక్కా.. నీవెక్కడ?

పెంపకంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఆ శాఖ అధికారులు ఔషధ మొక్కలను నాటారు. అందుకు రూ.లక్షలు వెచ్చించారు. సంరక్షణ చర్యలు లేకపోవడంతో మొక్కలు పాడయ్యాయి. నిధులు వృథా అయ్యాయి. మందస బీటు పరిధిలోని హొన్నాళి అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్‌ తీరు అందుకు అద్దం పడుతోంది.

Published : 25 Jun 2022 06:04 IST

- న్యూస్‌టుడే, మందస

మొక్కలే కనిపించని తోట

పెంపకంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఆ శాఖ అధికారులు ఔషధ మొక్కలను నాటారు. అందుకు రూ.లక్షలు వెచ్చించారు. సంరక్షణ చర్యలు లేకపోవడంతో మొక్కలు పాడయ్యాయి. నిధులు వృథా అయ్యాయి. మందస బీటు పరిధిలోని హొన్నాళి అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్‌ తీరు అందుకు అద్దం పడుతోంది.

ఒక్కటీ కానరాదే..
హొన్నాళి సమీప కొండ పాద భాగంలోని పది హెక్టార్లలో వేగిస, మారేడు, నేరేడు, ఉసిరి జాతులకు చెందిన 1,110 మొక్కలను 2015-16లో నాటారు. నేషనల్‌ మెడిసినల్‌ ప్లాంటేషన్‌ బోర్డు పథకం కింద దీనికి రూ.4 లక్షలు వెచ్చించారు. నాటిన తరువాత సంరక్షణ మరిచారు. మొక్కలు మేసే జంతువులు లోనికి రాకుండా చుట్టూ కందకం తవ్వారు. వర్షాలకు నేల కరిగి ఎప్పటిలాగ మారడంతో జింకలతో పాటు మేకలు, గొర్రెలు లోనికి ప్రవేశించి వాటిని తినేశాయి. దీనికి తోడు వేసవిలో నీటి తడులు లేకపోవడంతో మిగిలినవి కూడా ఎండిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక్క మొక్క కూడా లేదు. నిధులు వృథా అవడంతో పాటు లక్ష్యం నీరుగారినట్లయింది. ప్రస్తుతం ఆ ప్రదేశం పొదలతో బీడుగా మారింది.

వివరాలు తెలిపే బోర్డు


సంరక్షణ లేకనే
-రాజు, డీఆర్వో, మందస

హొన్నాళి ప్రాంతంలో ఆరేళ్ల కిందట ఔషధ మొక్కలు నాటారు. వాటి సంరక్షణను బీటు అధికారులు బాధ్యతగా చేపట్టలేదు. దీని కారణంగా జంతువులు మేయడం, వేసవిలో నీరు పోయక ఎండిపోయిన మాట వాస్తవమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని