logo

జీవనశైలి మార్పుతోనే గుండె పదిలం

ప్రపంచ గుండె దినోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు. జెమ్స్‌, కిమ్స్‌ ఆసుపత్రులు సంయుక్తంగా నిర్వహించిన చైతన్య ర్యాలీలను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి జెండాఊపి ప్రారంభించారు.

Published : 30 Sep 2022 06:32 IST

ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో మీనాక్షి, వైద్యులు

ప్రపంచ గుండె దినోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు. జెమ్స్‌, కిమ్స్‌ ఆసుపత్రులు సంయుక్తంగా నిర్వహించిన చైతన్య ర్యాలీలను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి జెండాఊపి ప్రారంభించారు. గుండె వ్యాధులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జీవనశైలి, ఆహార మార్పుతోనే హృదయం పదిలమని వైద్య నిపుణులు రవికిరణ్‌, విజయ్‌, సతీశ్‌, కల్యాణచక్రవర్తి పేర్కొన్నారు. డీఎస్పీ మహేంద్ర, జెమ్స్‌ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీలలిత, సర్వజన ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాన్న సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని