logo

ఎన్టీఆర్‌ పేరు పెట్టేవరకు పోరాడతాం

ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు రిలేదీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం గాంధీ జయంతి రోజున జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు ఎక్కడికక్కడ క్షీరాభిషేకం చేశారు.

Published : 03 Oct 2022 02:50 IST

గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న కూన రవికుమార్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు రిలేదీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం గాంధీ జయంతి రోజున జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు ఎక్కడికక్కడ క్షీరాభిషేకం చేశారు. ఆమదాలవలసలో పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రంలో తెదేపా కార్యాలయం వద్ద మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, నియోజకవర్గం ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి, నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పలాస నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలిలో స్థానిక నేతల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టేంతవరకు పోరాడతామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని