logo

అన్నదాత చివరి ప్రయత్నం

అన్నదాతలు ఎండుతున్న పైర్లను కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారనేందుకు సంతబొమ్మాళి మండలం మర్రిపాడులోని ఈ చిత్రమే నిదర్శనం.

Published : 02 Dec 2022 04:34 IST

అన్నదాతలు ఎండుతున్న పైర్లను కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారనేందుకు సంతబొమ్మాళి మండలం మర్రిపాడులోని ఈ చిత్రమే నిదర్శనం. ఈ ఏడాది మండలంలో 1,250 హెక్టార్లలో సన్న, చిన్నకారు రైతులు వరి సాగు చేశారు. వర్షాభావం, వంశధార సాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పలువురు రైతులు ఇంజిన్లు ఉపయోగించే స్థోమత లేకపోవడంతో వరుణుడి రాక కోసం ఎదురుచూస్తుండగా, మరికొందరు ఇంజిన్ల ద్వారా ఎకరాకు రూ.8 వేలు వరకు ఖర్చుపెట్టి దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని