logo

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి..

జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలను రూ.5 లక్షలకు పెంచాలని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండు చేశారు.

Published : 07 Feb 2023 06:21 IST

జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలను రూ.5 లక్షలకు పెంచాలని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండు చేశారు. జిల్లాపరిషత్తు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించలేదన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన  సిమెంట్, స్టీల్‌, ఇటుకలు, ఇసుక, కంకర ధరలు పెరిగాయన్నారు. ఇందుకు అనుగుణంగా రూ.5 లక్షలకు పెంచాలన్నారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీరామ్మూర్తి, సీనియర్‌ నాయకులు చాపర సుందరలాల్‌, చిక్కాల గోవిందరావు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. 

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని