logo

జగనన్నా ఇదేం చోద్యం..!

వారిద్దరూ జగనన్న కాలనీలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులుగా అధికారులు గుర్తించారు.

Updated : 30 Mar 2024 05:17 IST

స్థలం ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా కరపత్రాల పంపిణీ

వారిద్దరూ జగనన్న కాలనీలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులుగా అధికారులు గుర్తించారు. కానీ స్థలం మాత్రం మంజూరు చేయలేదు. దీనిపై ఉన్నతాధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది.. ఇప్పుడు జగనన్న మీకు రూ.2 లక్షలు విలువైన స్థలం ఇచ్చారని చెబుతూ నాయకులు వారికి వ్యక్తిగత లబ్ధి కరపత్రాలు పంపిణీ చేశారని కొత్తూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన కిల్లారి జ్యోతి, బానాల నాగమణి వాపోతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

న్యూస్‌టుడే, కొత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని