logo

Kamal Haasan: ఈసారి ఓడే ప్రసక్తే లేదు: కమల్‌హాసన్‌

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కోవై స్థానం నుంచి పోటీ చేసి గెలిచితీరుతానని, ఓడే ప్రసక్తే లేదని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ దీమా వ్యక్తం చేశారు.

Updated : 11 Sep 2023 10:50 IST

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కోవై స్థానం నుంచి పోటీ చేసి గెలిచితీరుతానని, ఓడే ప్రసక్తే లేదని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ దీమా వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత పార్టీ నిర్వాహకులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓడిపోవడం బాధాకరమని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కోవై స్థానం నుంచి పోటీ చేసి తప్పనిసరిగా గెలుపొందుతానని శపథం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని