logo

నయినార్‌ నాగేంద్రన్‌పై చర్యలు చేపట్టాలి

భాజపా అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌ కారు డ్రైవరు సతీష్‌, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.

Published : 19 Apr 2024 00:02 IST

ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఉత్తర్వులు 

చెన్నై నందనం ఆర్ట్స్‌ కళాశాలలో ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు,

ప్యారిస్‌, న్యూస్‌టుడే: భాజపా అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌ కారు డ్రైవరు సతీష్‌, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. తగిన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదుపై వివరణ ఇవ్వాలని నయినార్‌ నాగేంద్రన్‌ తదితరులకు తాంబరం పోలీసులు సమన్లు పంపారు. ఈ నేపత్యంలో నయినార్‌ నాగేంద్రన్‌పై అనర్హతవేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని తిరునెల్వేలి స్వతంత్ర అభ్యర్థి రాఘవన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం విచారించిన న్యాయమూర్తులు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్న వ్యవహారంతో సంబంధం ఉన్న నయినార్‌ నాగేంద్రన్‌పై తగిన చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు.

ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్న సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని