logo

మళ్లీ మోదీయే ప్రధాని: ఓపీఎస్‌

మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్‌ అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులను నియమించి ప్రత్యేకవర్గంగా పని చేస్తున్నారు.

Published : 01 May 2024 01:21 IST

మజ్జిగ అందిస్తున్న ఓపీఎస్‌

సైదాపేట, న్యూస్‌టుడే: మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్‌ అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులను నియమించి ప్రత్యేకవర్గంగా పని చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి రామనాథపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తన వర్గం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కమిటీ ఉత్తర చెన్నై కార్యదర్శి కొలత్తూరు కృష్ణమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన చెన్నై విల్లివాక్కం, తిరువీకానగర్‌ ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభించారు. ఓపీఎస్‌ పాల్గొని ప్రజలకు పండ్ల రసాలు, కొబ్బరిబొండాలు, పండ్లు అందించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఎండ ఎక్కువగా ఉంటుందని వాతావారణ కేంద్రం తెలిపిందని, ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. రామనాథపురంలో తనకు విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని