logo

మధ్యదారి.. వాగ్వాదాలే మరి!

విశాఖ నగర రవాణా వ్యవస్థలో  బీఆర్‌టీఎస్‌ మార్గాలు చాలా కీలకం. మధ్య దారిలో బస్సులు, అత్యవసర వాహనాలే ప్రయాణించాలి. ఇటు...ఇటు దారుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లాలి. కానీ, నిబంధనలు మీరి అన్ని రకాల వాహన చోదకులు మధ్య దారిలో ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు  ఎక్కువయ్యాయి.

Published : 25 Sep 2022 05:21 IST

బీఆర్‌టీఎస్‌ మధ్య మార్గంలో వస్తున్న వాహన చోదకుల చిత్రాలు తీస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌..

విశాఖ నగర రవాణా వ్యవస్థలో  బీఆర్‌టీఎస్‌ మార్గాలు చాలా కీలకం. మధ్య దారిలో బస్సులు, అత్యవసర వాహనాలే ప్రయాణించాలి. ఇటు...ఇటు దారుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లాలి. కానీ, నిబంధనలు మీరి అన్ని రకాల వాహన చోదకులు మధ్య దారిలో ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు  ఎక్కువయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రమాదాల కట్టడికి సీపీ శ్రీకాంత్‌ ఆదేశాలు జారీ చేయడంతో...గత రెండు రోజులుగా పోలీసులు ఎక్కడికక్కడ పరిశీలన చేస్తున్నారు. నిబంధనలు మీరిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.

* ఇదే క్రమంలో శనివారం కంచరపాలెం ఊర్వశి సెంటర్‌ వద్ద మధ్యదారిలో వచ్చిన కార్లు, ద్విచక్ర వాహన చోదకుల చిత్రాలను ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సెల్‌లో తీయడం వాగ్వాదానికి దారి తీసింది. రోడ్డు ఆరంభంలోనే అడ్డుకుంటే...మధ్యలో వచ్చేవాళ్లం కాదని, సగం దూర వచ్చాక ఫొటోలు తీసి జరిమానా విధిస్తామని చెప్పడం ఏంటంటూ ప్రశ్నించారు. మా ఫొటోలు తీస్తే...మేమూ మీ ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపిస్తామంటూ కానిస్టేబుల్‌తో కొందరు వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమయింది.
-ఈనాడు, విశాఖపట్నం


ఇద్దరి మధ్య వాగ్వాదం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని