logo

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

మీరు పిలిస్తే.. పలుకుతా..మీ సమస్యలు పరిష్కరిస్తా.. మీ ఆశలన్నీ నెరవేరుస్తానంటూ తామరబ్బ పంచాయతీ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తామరబ్బ, కొత్తబొడ్డపాడు, లోవముకుందపురం, పల్లపుకొడాబు గ్రామాల్లో పర్యటించారు.

Published : 03 Oct 2022 03:32 IST

గిరిజన మహిళకు ప్రభుత్వ పథకాల ప్రతిని అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : మీరు పిలిస్తే.. పలుకుతా..మీ సమస్యలు పరిష్కరిస్తా.. మీ ఆశలన్నీ నెరవేరుస్తానంటూ తామరబ్బ పంచాయతీ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తామరబ్బ, కొత్తబొడ్డపాడు, లోవముకుందపురం, పల్లపుకొడాబు గ్రామాల్లో పర్యటించారు. కొత్తబొడ్డపాడులో ఇళ్లపై విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకురాగా.. ఏఈ శంకరరావును పిలిచి తీగలను సరిచేయాలని ఆదేశించారు. తామరబ్బ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచి రామకృష్ణ, తహసీల్దారు లక్ష్మి, ఎంపీడీఓ రమణ, వైకాపా మండల అధ్యక్షుడు బాబూరావు, కార్యదర్శి లింగన్న పాల్గొన్నారు. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న తమ సర్వీసులను  క్రమబద్ధీకరించాలని జిల్లా విద్యుత్తు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.

అయ్యన్నా.. ఉలుకెందుకు?

సీఐడీ అధికారులు కేసు విచారణలో భాగంగా చింతకాయల విజయ్‌కు నోటీసు ఇస్తే ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడుకి ఉలికిపాటెందుకని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఐ-టీడీపీ సోషల్‌ మీడియాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతిపై  తప్పుడు కథనాన్ని సృష్టించి, ప్రసార మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసిన ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారని, ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసు ఇవ్వడానికి హైదరాబాదులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారన్నారు. కుమారుడు తప్పు చేసి ఉంటే మందలించి తన హుందాతనాన్ని అయ్యన్న చాటుకోవాలే తప్ప, సంయమనం కోల్పోయి వైఎస్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు