logo

మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!

ఎండాడ ఎంవీవీ గ్రీన్‌ గార్డెన్‌ అపార్టుమెంట్లో ఆదివారం ఎన్నికల తనిఖీ బృందం చేసిన సోదాలపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 19 Mar 2024 10:21 IST

అధికారుల సోదాల్లో వాస్తవమెంత.. 

ఎండాడ ఎంవీవీ గ్రీన్‌ గార్డెన్‌ అపార్టుమెంట్ వద్ద అధికారులు ఫ్లాట్లు తనిఖీ చేస్తుండగా సెల్లార్‌ నుంచి బయటకు వెళ్తున్న ఓ కారు

మధురవాడ, న్యూస్‌టుడే: ఎండాడ ఎంవీవీ గ్రీన్‌ గార్డెన్‌ అపార్టుమెంట్లో ఆదివారం ఎన్నికల తనిఖీ బృందం చేసిన సోదాలపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు అందించేందుకు నగదు, మద్యం, క్రికెట్ కిట్లు సంబంధిత అపార్టుమెంట్లో నిల్వ చేసినట్లు ఆదివారం ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ మేరకు జేసీ ఆదేశించగా.. అక్కడికి వచ్చిన అధికారులు సెల్లార్‌ నుంచి బయటకు వెళ్లిన మూడు కార్లను తనిఖీ చేయకుండా విడిచిపెట్టారని చర్చ సాగుతోంది. ఆ కార్లలోనే నిల్వ ఉంచిన సరకు బయటకు తరలించి ఉంటారని ఫిర్యాదుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సహకారం లేకుండా ఇదంతా జరిగి ఉంటుందా... ఫ్లాట్ల తనిఖీల ముసుగులో కార్లను విడిచి పెట్టారా అని అనుమానిస్తున్నారు. ఈ మూడు కార్లను ఎంవీవీ దగ్గరి బంధువుల ఆధ్వర్యంలో రోజూ ఇదే అపార్టుమెంట్ నుంచి ఎక్కువ సార్లు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని