logo

భూసమీకరణపై త్వరలో ప్రకటన?

భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌)ను నిలిపివేస్తున్నట్లు రెండు వారాల కిందట ‘కుడా’ అధికారిక ప్రకటన విడుదల చేసినా రైతులు శాంతించడం లేదు. వ్యతిరేకత మరింత తీవ్రమైంది.

Published : 29 May 2022 03:48 IST

రైతులను శాంతింపజేయడంపైనే దృష్టి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌)ను నిలిపివేస్తున్నట్లు రెండు వారాల కిందట ‘కుడా’ అధికారిక ప్రకటన విడుదల చేసినా రైతులు శాంతించడం లేదు. వ్యతిరేకత మరింత తీవ్రమైంది. దీంతో రైతులను నచ్చచెబుతూ త్వరలో కీలక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవోనెంబరు 80 శాశ్వతంగా రద్దు చేయాలని రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని రైతులను శాంతింపజేసేందుకు చొరవ చూపాలని వరంగల్‌, హనుమకొండ జిల్లాల ఎమ్మెల్యేలు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు శనివారం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సమావేశమై కీలక ప్రకటన చేస్తారనుకున్నారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూశారు. చివరకు సమావేశం రద్దయింది. రెండు,మూడు రోజుల్లో సమావేశం జరుగుతుందని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని