logo

చారిత్రక ఓరుగల్లంటే ఇష్టం

చారిత్రక ఓరుగల్లు నగరమంటే తనకెంతో ఇష్టమని బుల్లితెర యాంకర్‌, సినీనటి సుమ పేర్కొన్నారు. హనుమకొండ ఏకశిల పార్కు ఎదురుగా ఏర్పాటు చేసిన కళాధర్‌ ఫ్యాబ్రిక్‌ షోరూంను బుధవారం షోరూం యాజమాని

Published : 29 Sep 2022 02:03 IST

వెరైటీలు చూపుతున్న సుమ

ఎన్జీవోస్‌ కాలనీ, న్యూస్‌టుడే: చారిత్రక ఓరుగల్లు నగరమంటే తనకెంతో ఇష్టమని బుల్లితెర యాంకర్‌, సినీనటి సుమ పేర్కొన్నారు. హనుమకొండ ఏకశిల పార్కు ఎదురుగా ఏర్పాటు చేసిన కళాధర్‌ ఫ్యాబ్రిక్‌ షోరూంను బుధవారం షోరూం యాజమాని రాచబత్తిని వెంకటలక్ష్మి-అజయ్‌కుమార్‌లతో కలిసి ఆమె ప్రారంభించారు. మహిళలు, యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు అంతస్తుల్లోకి వెళ్లి ఆధునాతన చీరలు, వస్త్రాలను పరిశీలించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వెరైటీలను చూపుతూ ఫోజులిచ్చారు. ఓరుగల్లు నగర ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన, బ్రాండెండ్‌ వస్త్రాలను అందించడం అభినందనీయమన్నారు. షోరూం యాజమాని అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజల అభిమానంతో రెండో బ్రాంచి ఏర్పాటు చేయడం జరిగిందని, సరికొత్త డిజైన్లు, వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. తొలుత పరిణయ ది వెడ్డింగ్‌ స్టూడియోను ప్రారంభించారు. యువత సుమతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని