అర్హులందరికీ సంక్షేమ పథకాలందిస్తాం
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని కలెక్టర్ శివలింగయ్య అన్నారు.
సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ శివలింగయ్య, చిత్రంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, రోహిత్‌సింగ్, అధికారులు
జనగామ అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. బీసీ కుల, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సంగారెడ్డి నుంచి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. జనగామ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, రోహిత్‌సింగ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బీసీ కుల, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, ఇళ్ల పట్టాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి రవీందర్, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొర్నేలియస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!