logo

క్షయ వ్యాధి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌

క్షయ వ్యాధి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా వస్తుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Published : 28 Mar 2024 03:51 IST

ములుగు, న్యూస్‌టుడే: క్షయ వ్యాధి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా వస్తుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఈ వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందన్నారు. దగ్గు, తుమ్ములు, ఉమ్మి వేయడం ద్వారా గాలిలో కలుస్తుందని, తద్వారా ఆరోగ్యవంతులకు కూడా సోకుతుందన్నారు. రెండు వారాలకు పైబడి దగ్గు రావడం, సాయంత్రం సమయంలో జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రాత్రిపూట చెమటలు పట్టడం, రక్తంతో కూడిన దగ్గు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగితే జబ్బు తగ్గేంత వరకు మందులు వాడాలని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రవీందర్‌, జిల్లా మాస్‌ మీడియా ఆఫీసర్‌ తిరుపతయ్య, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని