logo

అమ్మవార్లకు సారె

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి, గోదాదేవి అమ్మవార్లకు ఆదివారం సారె సమర్పించారు. నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, ఆభరణాలను 108 పళ్లాల్లో తెచ్చారు.

Published : 03 Jan 2022 01:58 IST

పూలు, పండ్లు, గాజులు, నూతన వస్త్రాలు తీసుకొస్తున్న భక్తులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి, గోదాదేవి అమ్మవార్లకు ఆదివారం సారె సమర్పించారు. నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, ఆభరణాలను 108 పళ్లాల్లో తెచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి నూతన వస్త్రాలు, ఆళ్వారుల ఉత్సవ విగ్రహాలకు వస్త్రాలు, ధోవతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయ ఛైర్మన్‌ ఉప్పల గంగాధరం దంపతులు పూజల్లో పాల్గొన్నారు. వికాస తరంగిణి అధ్యక్షురాలు కొల్లూరి శ్యామలాంబ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొన్నారు. ఈవో సంగమేశ్వరశర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని