logo

ఎన్నికల బరిలో 99 మంది

జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో  99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది.

Published : 30 Apr 2024 06:26 IST

పార్లమెంట్‌కు 13, అసెంబ్లీ నియోజకవర్గాలకు 86 మంది పోటీ

 ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో  99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. ఆ ప్రక్రియ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 17 మంది నామపత్రాలు సమర్పించగా.. వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. మూడు నామపత్రాలు డమ్మీ అభ్యర్థులవి ఉండగా.. ఒక అభ్యర్థి 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు కారణంగా తిరస్కరించారు. 13 నామపత్రాలు ఆమోదం పొందాయి. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 86 మంది అభ్యర్థులు పోరులో నిలిచారు. మొత్తం 123 మంది నామపత్రాలు అందజేయగా..  పలు కారణాలతో 26 తిరస్కరణకు గురయ్యాయి. 11 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని