logo

సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?

కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు.

Published : 30 Apr 2024 06:23 IST

కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించం: కామినేని

 కైకలూరు సీఐ కార్యాలయంలో పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న కామినేని

 కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ఒక వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని, దానిని ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన బోయిన రాంబాబు ఫార్వడ్‌ చేశారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు చేశారని.. పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ రాంబాబును పోలీసులు పదేపదే ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. దీంతో రాంబాబుతో కలిసి కామినేని, తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు సోమవారం ఉదయం కైకలూరు సీఐ కార్యాలయానికి వెళ్లారు. సీఐ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందితో మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కామినేని మాట్లాడుతూ.. గతంలో వైకాపాలో ఉన్న రాంబాబు ప్రస్తుతం తనకు మద్దతుదారుగా ఉన్నారనే కారణంగా అతనిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆయన కుమారుడు నియంతల్లా వ్యవహరిస్తూ సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాంబాబు మాట్లాడుతూ.. కామినేనికి మద్దతుగా నిలిచాననే అక్కసుతో తనపై అక్రమ కేసులు పెట్టించే కుట్రలు పన్నుతున్నారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని