logo

వంద రోజుల పనిదినాలు అమలు చేయాల్సిందే : కలెక్టర్‌

జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూలీలకు వంద రోజుల పని దినాలను కచ్చితంగా కల్పించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రగతిపై

Published : 20 Jan 2022 01:57 IST

మాట్లాడుతున్న కార్తికేయ మిశ్రా

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూలీలకు వంద రోజుల పని దినాలను కచ్చితంగా కల్పించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన పనులకు చెల్లింపులను త్వరగా చేయాలన్నారు. వైఎస్సార్‌ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు, డ్రిల్లింగ్‌ పనులను వేగిరం చేయాలని ఆదేశించారు. ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చే పనులను వేగిరం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ హిమాన్షు శుక్లా, డీపీవో బాలాజీ, పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ చంద్ర భాస్కర రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రామస్వామి, డ్వామా పీడీ రాంబాబు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు