logo

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.

Updated : 16 Aug 2022 14:43 IST

దెందులూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. వట్లూరు ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను ఆయన భూమి పూజ చేసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమం ఉందని.. దానిని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రతి పాఠశాలను నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ మార్చడం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో పలు పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రెండో విడత ద్వారా అత్యధిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయన్నారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ చౌదరి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని