logo

తల్లి ఒడికి చేరిన శిశువు

ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కలహాలే రోజుల వయసున్న శిశువును పొదల్లో తల్లి వదలివెళ్లడానికి కారణంగా పోలీసుల విచారణలో తేల్చారు. ఆగిరిపల్లి ఎస్సై చంటిబాబు కథనం మేరకు.. మండలంలోని వడ్లమానుకు చెందిన ఓ యువతికి, ఈదర గ్రామానికి చెందిన యువకుడితో మూడేళ్ల కిందట వివాహమైంది.

Published : 26 Sep 2022 04:44 IST

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

శిశువును బంధువులకు  అప్పగిస్తున్న పోలీసులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కలహాలే రోజుల వయసున్న శిశువును పొదల్లో తల్లి వదలివెళ్లడానికి కారణంగా పోలీసుల విచారణలో తేల్చారు. ఆగిరిపల్లి ఎస్సై చంటిబాబు కథనం మేరకు.. మండలంలోని వడ్లమానుకు చెందిన ఓ యువతికి, ఈదర గ్రామానికి చెందిన యువకుడితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. భార్యాభర్తల మధ్య కలహాల నేపథ్యంలో యువతి పుట్టింటి వద్ద ఉంటోంది. భర్త అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. మరోవైపు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అప్పటికే ఉన్న బాలిక పోషణ భారమైంది. మళ్లీ ఇంకొకరిని పెంచి పెద్ద చేయడం కష్టంగా భావించి రోజుల వయసున్న మగ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లినట్లు ఎస్సై వెల్లడించారు. దీనిపై ఆదివారం మహిళా పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది సహకారంతో తల్లి వివరాలను గుర్తించి.. ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశువు వద్దకు చేర్చి ఛైౖల్డ్‌ కేర్‌ యూనిట్‌ వారికి అప్పగించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన ఎస్సై ఎన్‌.చంటిబాబు బృందాన్ని, మహిళా పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని